క్యూ1 ఫలితాలిచ్చిన బూస్ట్‌తో దూసుకెళ్లిన Tata Chemicals Shares.. 9% పెరిగాయ్..

ABN , First Publish Date - 2022-08-10T16:12:24+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా కెమికల్స్ అదిరిపోయే లాభాలను ఆర్జించాయి.

క్యూ1 ఫలితాలిచ్చిన బూస్ట్‌తో దూసుకెళ్లిన Tata Chemicals Shares.. 9% పెరిగాయ్..

Tata Chemicals Shares : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా కెమికల్స్(Tata Chemicals) అదిరిపోయే లాభాలను ఆర్జించాయి. దీంతో కంపెనీ షేర్లు ఇంట్రా డే(Intra day)లో దూసుకెళ్లాయి. బుధవారం ఇంట్రా-డేలో టాటా కెమికల్స్ షేర్లు బీఎస్‌ఈ(BSE)లో 9 శాతం పెరిగి రూ.1,042.55కి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏడాది ప్రాతిపదికన 87 శాతం వృద్ధిని నమోదు చేసి పన్ను తర్వాత లాభం(PAT) రూ.641 కోట్లు ఆర్జించింది. టాటా గ్రూప్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.342 కోట్ల పీఏటీని ఆర్జించింది.


కార్యకలాపాల ద్వారా కంపెనీ నివేదించిన ఆదాయం గత ఏడాది జూన్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,978 కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 34 శాతం పెరిగి రూ.3,995 కోట్లకు చేరుకుంది. తక్కువ శక్తి, ఇంధనం, సరుకు రవాణా ఖర్చు కారణంగా త్రైమాసికంలో ఎబిటా మార్జిన్‌లు 520 bps నుంచి 25.4 శాతానికి పెరిగాయి. ఈ స్థాయిలో పెరగడం టాటా కెమికల్స్ చరిత్రలోనే ఇదే ప్రథమం కావడం విశేషం.

Updated Date - 2022-08-10T16:12:24+05:30 IST