భాగస్వామ్యం, టెస్లాపై టాటా మోటార్స్ స్సష్టత...
ABN , First Publish Date - 2021-01-17T21:05:46+05:30 IST
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టనున్న నేపధ్యంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాటా మోటార్స్-టెస్లా జట్టు కడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే
ముంబై : ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టనున్న నేపధ్యంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాటా మోటార్స్-టెస్లా జట్టు కడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... దీనిపై టాటా మోటార్స్ స్పష్టతనిచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి టెస్లాతో భాగస్వామ్యానికి అవకాశాలు లేవని టాటా మోటార్స్ వెల్లడించింది. ఈ క్రమంలో... టాటా మోటార్స్ టెస్లాతో భాగస్వామ్యం ప్రచారానికి తెరదింపింది. టెస్లాపై ట్వీట్‌ను కూడా తొలగించింది. అనంతరం ఎలాంటి భాగస్వామ్యం కోసం నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది.