Tata Gemini: ఒగ్గు కథ ప్రదర్శన ద్వారా కల్తీ టీ పొడిపై టాటా జెమినీ అవగాహన కార్యక్రమం

ABN , First Publish Date - 2022-10-08T01:10:03+05:30 IST

అక్కడ విశేష ఆదరణ లభించడంతో తాజాగా సంగారెడ్డిలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా రసాయన రంగులు వేసి తయారు చేస్తున్న టీ పొడి వల్ల కలిగే దుష్పరిణామాల

Tata Gemini: ఒగ్గు కథ ప్రదర్శన ద్వారా కల్తీ టీ పొడిపై టాటా జెమినీ అవగాహన కార్యక్రమం

హైదరాబాద్: కల్తీ టీ పొడిపై ఒగ్గు కథ ప్రదర్శన ద్వారా ప్రజలల్లో అవగాహన పెంచుతున్న ప్రసిద్ధ టీ బ్రాండ్ జెమిని తాజాగా సంగారెడ్డిలో ప్రదర్శన ఇచ్చింది. ఇప్పటికే జనగామ, వరంగల్, కరీంనగర్‌లలో నిర్వహించింది. అక్కడ విశేష ఆదరణ లభించడంతో తాజాగా సంగారెడ్డిలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా రసాయన రంగులు వేసి తయారు చేస్తున్న టీ పొడి వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహ కల్పించింది. ప్రదర్శనకు హాజరైన ప్రజలకు కల్తీ టీ తాగడం వల్ల కలిగే నష్టాలతోపాటు బ్రాండెడ్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. 


తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న ఒగ్గు కథ ద్వారా కల్తీలపై చేస్తున్న ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది. అంతేకాదు, ఇంటింటికి వెల్లి అవగాహన కల్పించడంతోపాటు ‘కోల్డ్ వాటర్ టెస్ట్’ చేస్తూ కల్తీ టీ పొడిని గుర్తించడమెలానో వివరిస్తూ అవగాహన కల్పిస్తోంది. లక్ష ఇళ్లలో ఈ పరీక్షలను చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తెలంగాణాలో ఇప్పటికే 35వేలకు పైగా  ఇళ్లలో ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ  కార్యక్రమంపై టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రెసిడెంట్  పునీత్‌ దాస్‌ మాట్లాడుతూ.. ప్యాకేజ్డ్ టీ బ్రాండ్‌గా తెలంగాణలో తాము అగ్రస్థానంలో ఉన్నట్టు చెప్పారు. తెలంగాణలో కల్తీ టీ పొడి ప్రభావం విపరీతంగా ఉన్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఒగ్గు కథ ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు జానపద కళారూపమైన ఒగ్గుకథను ఎంచుకున్నట్టు వివరించారు. 

Updated Date - 2022-10-08T01:10:03+05:30 IST