సెమీకండక్టర్ల రంగంలోకి టాటా గ్రూప్‌

ABN , First Publish Date - 2021-11-27T06:11:10+05:30 IST

టాటా గ్రూప్‌ మరో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. కొత్తగా సెమీకండక్టర్ల అసెంబ్లింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలని గ్రూప్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా 30 కోట్ల డాలర్ల....

సెమీకండక్టర్ల రంగంలోకి టాటా గ్రూప్‌

రూ.2,220 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ ! 

తెలంగాణ సహా మరో రెండు రాష్ట్రాలతో చర్చలు


న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌ మరో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. కొత్తగా సెమీకండక్టర్ల అసెంబ్లింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలని గ్రూప్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా 30 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,220 కోట్లు) పెట్టుబడులతో ఇందుకు అవసరమైన ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు 4,000 మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంట్‌కు అవసరమైన భూములు ఇచ్చేందుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు  పోటీపడుతున్నాయి. ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి టాటా గ్రూప్‌ ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 


డిసెంబరులోగా నిర్ణయం: సెమీ కండక్టర్ల అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై టాటా గ్రూప్‌ వచ్చే నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో పాటు సముచిత  జీతాలతో నిఫుణులైన ఉద్యోగులు దొరకడం ఆధారంగా ప్లాంట్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  టాటా గ్రూప్‌ నిర్ణయం హైటెక్‌ ఎలకా్ట్రనిక్స్‌ రంగంలోనూ ‘భారత్‌లో తయారీ’ని ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ పిలుపుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఔట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌ (ఓఎ స్‌ఏటీ) పద్తతిలో సెమీకండక్టర్లను కూర్చి ఇంటెల్‌, ఏఎండీ, ఎస్‌టీమైక్రోఎలకా్ట్రనిక్స్‌ వంటి కంపెనీలకు సరఫరా చేయాలని టాటా  గ్రూప్‌ యోచిస్తోంది.

Updated Date - 2021-11-27T06:11:10+05:30 IST