‘ ప్రజలపై పన్నుల భారం తగదు ’

ABN , First Publish Date - 2021-07-26T03:54:27+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రజలపై ఆస్తి, చెత్త పన్నుల భారం మోపడం తగదని, వెంటనే వాటిని రద్దు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు.

‘ ప్రజలపై పన్నుల భారం తగదు ’
నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాల ప్రతినిధులు

 దాసన్నపేట, జూలై 25:  కరోనా నేపథ్యంలో ప్రజలపై ఆస్తి, చెత్త పన్నుల భారం మోపడం తగదని, వెంటనే వాటిని రద్దు చేయాలని  పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు.  ఆదివారం కోట జంక్షన్‌ సమీపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు, నగర వాసుల  సంతకాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..   ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేసేందుకు ఇళ్లకు కొలతలు తీయడం , చెత్తపన్ను కోసం నెలకు రూ. 90 చొప్పున కట్టాలని చెప్పడం సరి కాదన్నారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా పన్నులతో హడలెత్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  కార్పొరేషన్‌లో చెత్తపన్నును రద్దు చేయకుంటే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  ప్రజలపై పన్నుల భారం వేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌చంద్ర పట్నాయక్‌  తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు రాము, ఆనంద్‌, కె.శ్రీనివాసరావు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 

Updated Date - 2021-07-26T03:54:27+05:30 IST