ltrScrptTheme3

పన్నుల వసూలుతోనే పంచాయతీల అభివృద్ధి

Oct 27 2021 @ 00:43AM

 డీపీఓ పార్వతి

ఓబుళదేవరచెరువు,  అక్టోబరు 26:  పంచాయతీ పరిధిలో విధిగా ఇంటి పన్నులు, ఇతర పన్నులు వసూలు చేసి పంచాయతీ అభివృద్ధికి దోహద పడాలని గ్రామ కార్యదర్శులకు డీపీఓ పార్వతి ఆదేశించారు. మంగళవారం కొండకమర్ల గ్రామ సచివాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీలోని దీనికి సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా వందరోజుల ప్రణాళికలో ప్రతి రోజు ఓ కార్యక్రమం నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ద్యం లోపించకుండా సత్వరమే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ట్రైసైకిళ్ళు ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి తడి, పొడి చెత్తను పారిశుధ్య కార్మికులు సేకరించే విధంగా చర్యలు తీసుకో వాల న్నారు. అనంతరం ఆమె చెత్త సేకరణ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ప్రధా నంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం పక్కా ప్రణాళికలతో వంద రోజుల పాటు ప్రతి రోజు కార్య క్రమం చేపట్టాలన్నారు. ఆమెతో పాటు ఈఓఆర్‌డీ రాజశేఖర్‌, కార్యదర్శులు బాబు రావు, గౌస్‌సాహెబ్‌, శ్రీకాంత్‌, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

నల్లమాడ: మండల కేంద్రంలోని సచివాలయం -1 కార్యాలయాన్ని డీపీఓ పార్వ తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రికార్డులు సక్ర మంగా నిర్వహించడం లేదని సంబంధిత సచివాలయ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పంచాయతీ సిబ్బం దితో పాటు వలంటీర్లు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఇంటింటికి వెళ్ళి పరిశుభ్రతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా సిబ్బంది ఇంటి పన్నులు వసూలు సక్రమంగా చేయలేదన్నారు. దీని వలన పం చాయతీ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అనంతరం చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మి కులు వేతనాలు పెంచాలని డీపీఓకు విన్నవించుకున్నారు. అదేవిధంగా నల్లమాడలో  లేఅవుట్‌లను ఆమె పరిశీలించారు. అనుమతి లేకుండా వేసి న లేఅవుట్‌లను కొను గోలు చేయకుండా నోటీసులు అతికించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఓతో పాటు పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.