ట్యాక్సీలు, ఆటోల బంద్‌

ABN , First Publish Date - 2022-05-20T05:18:10+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 714జీఓను రద్దు చేయాలంటూ గురువారం గోదావరిఖనిలో ట్యాక్సీ, ఆటోల డ్రైవర్లు, ఓనర్లు కదం తొక్కారు.

ట్యాక్సీలు, ఆటోల బంద్‌
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఆటోడ్రైవర్లు, ఓనర్లు

- జీఓ నం.714ను రద్దు చేయాలని డిమాండ్‌ 

- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కళ్యాణ్‌నగర్‌/జ్యోతినగర్‌, మే 19: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 714జీఓను రద్దు చేయాలంటూ గురువారం గోదావరిఖనిలో ట్యాక్సీ, ఆటోల డ్రైవర్లు, ఓనర్లు కదం తొక్కారు. గురువారం గోదావరిఖనిలో ఆటో, ట్యాక్సీల బంద్‌ విజయవంతం అయ్యింది. రామగుండం కార్పొరేషన్‌ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భం గా ఆటో యూనియన్‌ అధ్యక్షుడు ఈర్ల ఐలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ కార్మికుల పొట్టకొట్టే విధంగా ఉందని, ఫిట్‌నెస్‌ లేని వాహనంపై ప్రతిరోజు రూ.50 జరిమానా విధిం చడం సరైంది కాదని, ఇప్పటికే డ్రైవర్లు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జీఓను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నీలారపు రవి, అన్ను, సురేష్‌, యూసుఫ్‌, శ్రీనివాస్‌, సంపత్‌, బుచ్చయ్య, నరేష్‌ పాల్గొన్నారు. గోదావరిఖని ట్యాక్సీ, ఓనర్స్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ (టీఆర్‌సీపీటీయూ) ఆధ్వర్యంలో డ్రైవర్లు, ఓనర్లు భారీ ర్యాలీ నిర్వహించా రు. ట్యాక్సీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడు మొండెద్దుల మల్లేష్‌ మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లైఫ్‌ ట్యాక్సీలు, ఫిట్‌నెస్‌ చార్జీలను పెంచిందని, మరో పక్క డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడం వల్ల కిరాయిలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించి డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీఓ నం.714ను రద్దు చేయాలని డిమాం డ్‌ చేశారు. అనంతరం ఎన్‌టీపీసీలోని ఆర్‌ టీఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చి ఎంవీఐ భీమ్‌సింగ్‌కువినతి పత్రం అందజేశారు. ఈ  కార్యక్రమంలో ఎలిగేటి స తీష్‌, కట్కూరి జనార్ధనర్‌, నాగరాజు, ఆసా ల స్వామి, పంజాల శ్రీనివాస్‌, బేతి రవి, రాజమౌళి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:18:10+05:30 IST