ముగిసిన క్షయ వ్యాధి ప్రాబల్య సర్వే

ABN , First Publish Date - 2021-03-09T05:54:35+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన ఇంటింటా క్షయవ్యాధి ప్రాబల్య సర్వే ముగిసింది. గత నెల 8 నుంచి 22 వరకు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో క్షయవ్యాధి ప్రాబల్య సర్వేను క్షయ నియంత్రణ అధికారులు నిర్వహించారు.

ముగిసిన క్షయ వ్యాధి ప్రాబల్య సర్వే

భద్రాచలం, మార్చి 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన ఇంటింటా క్షయవ్యాధి ప్రాబల్య సర్వే ముగిసింది. గత నెల 8 నుంచి 22 వరకు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో క్షయవ్యాధి ప్రాబల్య సర్వేను క్షయ నియంత్రణ అధికారులు నిర్వహించారు. నిర్దేశిత సమయం వరకు జిల్లాలో 17 క్షయ పాజిటివ్‌ కేసులు అధికారికంగా గుర్తించారు. దీంతో ఈ సర్వేను మరో పది రోజుల పాటు అదనంగా నిర్వహించారు. ఈ క్రమంలో 33 పాజిటివ్‌ కేసులు గుర్తించామని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం రేగుబల్లి, అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి, మణుగూరు మండలంలోని కమలాపురం వార్డు నెంబరు 17, పాల్వంచ మండలంలోని రా ంనగర్‌వార్డు నెంబరు 13, ములకలపల్లి మండలంలోని చాపర్లపల్లి, చండ్రుగొం డ మండల కేంద్రం, కొత్తగూడెంలోని రామవరం, టేకులపల్లి మండలంలోని గంగారం, ఇల్లెందు మండలంలోని వార్డు నెంబరు 3, దమ్మపేట మండలంలోని వడ్లగూడెంలలో క్షయ ప్రాబల్య సర్వేను అధికారులు నిర్వహించారు. ఈ సర్వే బృందం ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లో క్షయ లక్షణాలు ఉన్నవారు ఉన్నారా?, గతంలో క్షయ వచ్చి తగ్గిన వారు ఉన్నారా?, క్షయ మందులు వాడుతున్నవారు ఉన్నారా లాంటి వివరాలను తెలుసుకొని ఒక వేళ ఎవరైనా ఉంటే వారి నుంచి నమూనాలను సేకరించి భద్రాచలం, కొత్తగూడెంలో సిడాట్‌ పరికరం ద్వారా పరీక్షించి క్షయ ఏ స్థాయిలో ఉందో నిర్ధారించారు. జిల్లాలో 4,370 ఇళ్లను క్షయ విభాగం, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సందర్శించి 14,950 మందిని పరీక్షించినట్లు క్షయనివారణ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

గడువు పొడిగింపేనా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇం టింటా క్షయవ్యాధి ప్రాబల్య సర్వేను వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్వహిస్తు న్నా రు. ఈ నెల 8 నుంచి 22 వరకు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ని జామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో క్షయవ్యాధి ప్రాబల్య సర్వేను క్షయ నియంత్రణ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 17 క్షయ పాజిటివ్‌ కేసు లు అధికారికంగా గుర్తించారు. అయితే అధికారిక నిబంధనల ప్రకారం కనీసం 30 పాజిటివ్‌లు వచ్చే వరకు సర్వే నిర్వహించాల్సి ఉంటుందని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సోమవారంతో గడువు ముగి యనుండగా ఇప్పటి వరకు 17 పాజిటివ్‌ కేసులు మాత్రమే రావడంతో సర్వే కోసం గడువు తేదీని మరింత పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత రాకున్నా సో మవారం వచ్చే అవకాశాలు లేకపోలేదని అధికారులు పే ర్కొంటున్నారు. సర్వే పొడిగింపు విషయమై జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ను ఆం ధ్రజ్యోతి సంప్రదించగా ఈ విషయమై ఇంకా అధికారికంగా ఎటువంటి సమా చారం రాలేదన్నారు. అయితే గడువు పొడిగించే అవకాశాలు లేకపోలేదన్నారు.

Updated Date - 2021-03-09T05:54:35+05:30 IST