కార్మికులను మోసం చేస్తున్న టీబీజీకేఎస్‌

ABN , First Publish Date - 2021-08-03T05:47:14+05:30 IST

గుర్తింపు సంఘంగా రెండు పర్యాయాలు ఉన్న టీబీజీకేఎస్‌ కార్మికులను మోసం చేస్తున్నదని ఏఐటీయూసీ ప్రధా న కార్యదర్శి సీతారామయ్య ఆరోపించారు.

కార్మికులను మోసం చేస్తున్న టీబీజీకేఎస్‌
గేట్‌మీటింగ్‌లో మాట్లాడుతున్న సీతారామయ్య

- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య

గోదావరిఖని, ఆగస్టు 2: గుర్తింపు సంఘంగా రెండు పర్యాయాలు ఉన్న టీబీజీకేఎస్‌ కార్మికులను మోసం చేస్తున్నదని ఏఐటీయూసీ ప్రధా న కార్యదర్శి సీతారామయ్య ఆరోపించారు. సోమవారం 11ఇంక్లయిన్‌ గనిలో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయనమా ట్లాడారు. సీఎం కేసీఆర్‌తో పాటు టీబీజీకేఎస్‌ చెప్పిన మాయమాటలు నమ్మి కార్మికులు రెండుసా ర్లు గెలిపిస్తే, కార్మికులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కొత్త గనులను ప్రారంభించి, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని హామీకి పూర్తి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఉన్న గనులు మూత పడుతుండడం, భారీగా కార్మికుల సంఖ్య తగ్గుతున్నట్టు సీతారామయ్య పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో 20వేల కార్మికులు తగ్గినట్టు తెలిపారు. సంస్థలో మితిమీరిన రాజకీయ జోక్యంతో పాటు అవినీతి తారాస్థాయికి చేరిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపించాలని సీతారామయ్య డిమాండ్‌ చేశారు. సింగరేణి అధికారులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తీరుగా వ్యవహరిస్తు న్నట్టు విమర్శించారు. సింగరేణి నుంచి మినరల్‌ఫండ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 2740 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని సీతారామయ్య డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ వయస్సు 61కి పెంచినట్టు ఉద్యోగ అర్హత వయస్సు 40ఏళ్ళకు పెంచాలని సీతారామయ్య డిమాండ్‌ చేశారు. సమస్యల న్నింటినిపై రెండు రోజుల నిరహార దీక్షలు చేపట్టనున్నట్టు సీతారామయ్య తెలిపారు. ఈనెల 10,11 తేదీల్లో అన్ని జీఎం ఆఫీస్‌ల ఎదుట నిరాహార దీక్షలను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈగేట్‌మీటింగ్‌లో వేల్పుల నారాయణ, ఆరెల్లి పోషం, మడ్డి ఎల్లయ్య, సంపత్‌, భాస్కర్‌, రామస్వామి, బోగ సతీష్‌, గౌతం గోవర్థన్‌, మోహన్‌, చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:47:14+05:30 IST