tcs: టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం.. 80 శాతం మంది ఉద్యోగులకు...

ABN , First Publish Date - 2022-09-24T02:56:38+05:30 IST

దేశవ్యాప్తంగా కొవిడ్-19(covid-19) కేసులు గణనీయంగా తగ్గిపోవడం, ఆంక్షలు కూడా పెద్దగా లేకపోవడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌(Work from home)కి ముగింపు పలికేందుకు సమాయత్తమవుతున్నాయి.

tcs: టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం.. 80 శాతం మంది ఉద్యోగులకు...

దేశవ్యాప్తంగా కొవిడ్-19(covid-19) కేసులు గణనీయంగా తగ్గడం, ఆంక్షలు కూడా పెద్దగా లేకపోవడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌(Work from home)కి ముగింపు పలికేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ దిగ్గజం టీసీఎస్(TCS) కీలక అడుగువేసింది. కంపెనీకి చెందిన ఉద్యోగుల్లో 80 శాతం మందిని తిరిగి ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కోరింది. వారంలో 3 రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌ నుంచి పనిచేయాల్సిందేనని తెలియజేస్తూ ఉద్యోగులకు అఫీషియల్‌గా ఈ-మెయిల్స్ పంపించింది. ఇక సీనియర్ స్టాఫ్ మెంబర్స్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్‌ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు తెలియజేసింది. సీనియర్ ఉద్యోగులు వారంలో 5 రోజులు తప్పనిసరిగా ఆఫీస్ నుంచి పనిచేయాలని తేల్చిచెప్పినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 


టీసీఎస్‌కు చెందిన సీనియర్ ఉద్యోగులు ఇప్పటికే ఆఫీస్‌ల నుంచి పనిచేస్తున్నారు. కంపెనీ కస్టమర్లు కూడా ఆఫీస్‌లకే వస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు కూడా వారంలో 3 రోజులు ఆఫీస్‌ల నుంచి పనిచేయాలని టీసీఎస్ పేర్కొంది. కాగా టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ 2020 మే నెలలో  25x25 మోడల్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించాలనుకున్నారు. కానీ అంతకంటే ముందే ఉద్యోగులను కార్యాలయాలకు పిలుస్తున్నారు. మరోవైపు కరోనా సమయంలో టీసీఎస్‌లో చేరి, ఇంతవరకు ఆఫీస్ ముఖం చూడని కొత్తఉద్యోగులకు స్వాగతం పలకాలని కంపెనీ యోచిస్తోంది. ‘‘ వర్క్ రెండేళ్ల క్రితం కంపెనీలో చేరి ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్‌కు రాబోతున్న కొత్త ఉద్యోగులకు స్వాగతం పలికేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నాం’’ అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో కంపెనీ పేర్కొంది.


మిగతా కంపెనీలదీ ఇదే బాట..

టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్, టెస్లా వంటి కంపెనీలు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ముగింపు పలకాలని యోచిస్తున్నాయి. వారంలో కనీస రోజులైనా కార్యాలయాల నుంచి పనిచేయాలని చెబుతున్నాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ గతవారం ఈ మేరకు ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. వారంలో కనీసం 40 గంటలైనా ఆఫీస్ నుంచి పనిచేయాలని పేర్కొన్నారు. ఇక హైబ్రీడ్ వర్క్ మోడల్‌లోకి మారాలని గూగుల్ కంపెనీ తన ఉద్యోగులకు ఏప్రిల్‌లో సమాచారమిచ్చింది. హెచ్‌సీఎల్ కంపెనీ కూడా 6 శాతానికిపైగా సిబ్బందిని ఆఫీసుల నుంచి పనిచేయిస్తోంది. టెక్ మహింద్రా కంపెనీ కూడా హైబ్రీడ్ మోడల్‌లోకి మారింది. ఉద్యోగుల్లో 25 -30 శాతం మంది తిరిగి కార్యాలయాలకు పిలిచిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-09-24T02:56:38+05:30 IST