
అమరావతి: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీఎల్పీ కార్యాలయానికి మంత్రి పేర్నినాని వెళ్లారు. అంతేనా టీడీఎల్పీ కార్యాలయంలోని అటెండర్ నుంచి సెక్రెటరీ వరకూ అందరితో చనువుగా మాట్లాడారు. కార్యాలయ సిబ్బంది ఇచ్చిన స్నాక్స్ తిని, టీ తాగుతూ టీడీపీ ఎమ్మెల్యేలతో పిచ్చాపాటి మాట్లాడారు. ఇంత జరుగుతుంటే వైసీపీ నేతలు ఊరుకుంటారా.. శాసనసభలో యుద్ధం, లాబీల్లో దోస్తీ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు సంధించారట. అసెంబ్లీ సమావేశాలకు ముందు తర్వాత కూడా నాని అందరితో చనువుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన అందరితో కలిసిపోతారు. మీడియాతోనూ చనువుగా ఉంటారు.
కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో కూడా ఆయన క్లోజ్‌గా ఉంటారు. రాష్ట్రంలోని ఇతర పక్షాలతోనూ మాటలు కలుపుతూ ఉంటారు. ఇంత జరుగుతుంటే వైసీపీ నేతలు ఊరుకుంటారా?.. విషయం చెవిన పడగానే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల నాని, జగన్‌ను కలిసినప్పుడు ఈ విషయాలను సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తనతో అందరూ బాగుంటారని, రాజకీయాల్లో తన పని తాను చేసుకుంటూ పోతానని వివరించినట్లు సమాచారం. ఎవరిని, కలిసినా ఎంత స్నేహంగా ఉన్నా.. పార్టీ లైన్లోనే ఉంటానని నాని చెప్పినట్లు తెలిస్తోంది. అంతా విన్న జగన్ ఓకే.. కానీ ముందు వెనుకా చూసుకుని మాట్లాడాలని నానికి సూచించారని చెబుతున్నారు. జగన్ సంగతి ఏమోగానీ.. టీడీఎల్పీ నాని కార్యాలయానికి వెళ్లడం వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి