అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పురపాలిక ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు పెడతామని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన చేశారు. ఉద్యోగాల కల్పనలో వైసీపీ విఫలమవుతోందన్నారు.