బెల్జియంలో ఆకాశాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు!

Published: Tue, 29 Mar 2022 17:27:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బెల్జియంలో ఆకాశాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు!

ఎవరు నువ్వు అంటే మద్రాసీ అని చెప్పుకునే స్థాయి నుండి ‘నేను తెలుగు వాడిని.. నాది తెలుగురాష్ట్రం.. నాది ఆంధ్రప్రదేశ్’ అని దేశం నలుమూలలా సగర్వంగా చెప్పుకునేలా తెలుగు వాడి ఆత్మగౌవాన్ని నిలబెట్టిన పార్టీ టీడీపీ.  అన్న NTR తెలుగుదేశం టీడీపీని స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా 40 వసంతాల వేడుకల్ని  BELGIUM దేశంలో BRUSSELS పట్టణంలో.. ‘ఇది రా నా తెలుగుదేశం సత్తా’ అని చెప్పుకునేలా, దేశం దాటి వచ్చినా పార్టీ మీద అభిమానం పోదు అని చాటి చెప్పిన తెలుగుదేశం NRI TDP యూరోప్ TEAM.. Dr. శ్రీ కిశోర్ బాబు సమన్వయంతో, కావూరి కొండయ్య, అలవాలపాటి శివకృష్ణ, కొండూరు దినేష్ వర్మ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేదిక పరిసరాలను తెలుగుదేశం పార్టీ స్లోగన్స్‌తో మారుమ్రోగి పోయేలా జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వేదిక పరిసరాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు, మిత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఆదేశాల ప్రకారం సమిష్టిగా వేడుకల్ని నిర్వహించారు. 

బెల్జియంలో ఆకాశాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు!

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పరుచూరు నియోజకవర్గ MLA ఏలూరి సాంబశివరావు, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి.. అధ్యక్షత వహించి వేడుకల్ని నిర్వహించిన వారిని అభినందించి వేడుకలకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అభిమానులకు మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ ఉన్నా స్వదేశాన్ని పుట్టిన భూమిని, ఈ స్థాయికి రావటానికి ఉపయోగపడిన పార్టీ కోసం వారు చేస్తున్న సేవలు అభినందనీయమని, అలాగే అందరూ కలిసికట్టుగా, పార్టీ వారిగా ఇక్కడికి వచ్చే తెలుగు వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు.  అన్న NTR  తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని దేశం నలుదిశలా చాటి చెప్తే దానిని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేశారని కొనియాడారు.  ఎన్నో బిజీ షెడ్యూల్‌లో కూడా తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరు అయిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

బెల్జియంలో ఆకాశాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.