
తెలుగుదేశం కువైత్ ఆధ్వర్యములో పలు ప్రాంతాలలో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కువైత్‌లోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కువైత్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం కువైట్‌లో ఉన్న కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎక్కువ అభిమానులు ఒకేచోట గుమ్మిగూడకుండా కువైత్‌లోని వివిధ ప్రాంతాలలో ఈ వేడుకలను చేసుకున్నారు. అబుహలిఫా, ఫహాహీల్, మహబూలా, సాల్మియా, హవల్లీ, ఖాద్సియా, ఫర్వానియా, ఆర్దియా ప్రాంతాలలో ఆయా ఏరియాలలో ఉన్న టీడీపీ అభిమానులతో ఈ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా తెలుగుదేశం కువైత్ పీ.ఆర్.వో మద్దిన ఈశ్వర్‌నాయుడు మాట్లాడుతూ మహానుభావుడు అన్న నందమూరి తారకరామారావు చేతులమీదుగా "తెలుగువాడి ఆత్మగౌరవం" కోసం 40ఏళ్ల క్రితం స్థాపించబడ్డ ఈపార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టి దేశంలోనే ముందు ఉండేది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం అనునిత్యం పోరాడుతూ ప్రభుత్వంపై ప్రజల కోసం యుద్దం చేస్తుంది అన్నారు. అనంతంర తెలుగుదేశం కువైత్ అధికారప్రతినిధి షేక్ బాషా మాట్లాడుతూ అన్న నందమూరి రామారావు పార్టీని 13 సంవత్సరాలు నడిపితే ఆ తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రన్నగత 27 సంవత్సరాలుగా పార్టీని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఆయన తన విజన్‌తో అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఇప్పుడు విడిపోయిన ఆంధ్రరాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ది పరిచారని పేర్కొన్నారు.

మరో అధికార ప్రతినిధి బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఒక్క చాన్స్ అంటూ ప్రజలని బ్రతిమాలి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల సంక్షేమాలను విస్మరించి దోచుకోవటమే పనిగా పని చేస్తున్నారని విమర్శించారు.ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందని, అందరం ఈవిషయాన్ని గమనించి 2024లో చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. తెలుగుదేశం కువైత్ తెలుగు యువత అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ 2024 లోమనం అందరం వెళ్ళి మరియు మనకి తెలిసిన వారి ద్వారా ఎన్నికల్లో ఓట్లు వేయించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తేవాలని కోరారు.

తెలుగుదేశం కువైత్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ చాంద్ బాషా మాట్లాడుతూ మాదేహంలో వుంది పసుపు రక్తం అని, తుదిశ్వాస విడిచే వరకు మేము పార్టి కోసం పని చేస్తామని అన్నారు. తరువాత తెలుగుదేశం కువైత్ గౌరవ సలహాదారులు, పెద్దలు యెనిగళ్ళ బాలకృష్ణ మాట్లాడుతూ విదేశాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు ఇలా నిర్వహించటం సంతోషం అంటూ అందరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. అన్నిచోట్ల కేక్ కటింగులతో కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమంలో రావి వెంకటరమణ, కొత్తపల్లి భవానిప్రసాద్, బల్లపురం మల్లయ్య, తుమ్మల వెంకటేశ్వరరావు, వంశీకృష్ణ కాపెర్ల, శివమంచూరి, కుటుంబరావు, కొల్లి ఆంజనేయులు, ఫర్వానియా బాలా, ఖాద్సియ నరసింహా తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి