
ఎన్నారై డెస్క్: తెలుగు వారి సత్తా చాటుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి ప్రభత్వ పగ్గాలు చేపట్టారు. పేద, బలహీన వర్గాల ఉన్నతకి పాటుపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీ పుట్టి 40 వసంతాలు నిండాయి. ఈ నేపథ్యంలో ఎన్నారై యూరప్ టీం సభ్యులు డాక్టర్ కిషోర్ బాబు, సామ్రాట్ జలగడుగు, గోగినేని శ్రీనివాస్, శ్యామ్ సుందర్ రావు ఊట్ల ఆధ్వర్యంలో వేల్స్లోని (Cardiff) టీడీపీ సభ్యులు టీడీపీ 40వ వార్షికోత్సవ వేడులను ఘనంగా జరిపారు. వేదిక మొత్తాన్ని పసుపుమయం చేశారు. పార్టీ పాటలు, స్లోగన్లతో వేదిక మొత్తం దద్దరిల్లింది. పార్టీ అధికారంలో లేకున్నా నేను తెలుగుదేశం నాది తెలుగుదేశం మాది తెలుగుదేశం అని ప్రతీ ఒక్కరూ తమ అభిమానాన్ని చూపారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, రామకృష్ణ నల్లబోతు, నవీన్ బాలా, ప్రవీణ్ మాగంటి తదితరులతోపాటు అనేక మంది టీడీపీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి