
లండన్: తెలుగోడి ఆత్మగౌరవాన్ని దేశం దశ దిశలా తెలియజేసిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పిలుపు మేరకు 40 వసంతాల పార్టీ పుట్టినరోజు వేడుకలు ఎన్నారై టీడీపీ యూరప్ ఆధ్వర్యంలో లండన్లోని CHEAM, CROYDON, SUTTONలో అంగరంగ వైభవంగా జరిగాయి. నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్రీనివాస్ గోగినేని కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఆంధ్రానా లేక విదేశమా అని ఆలోచించే విధంగా పసుపు పచ్చని జెండాలే తోరణాలుగా వేదికను అలంకరించి విదేశమైనా స్వదేశమైన తెలుగుదేశం పార్టీ మీద అభిమానానికి అవధులు లేవని నిరూపించారు. ఎల్లలు దాటినా నరనరాన ఇంకి పోయిన పసుపు అభిమానం కరిగిపోదు అని జై తెలుగుదేశం.. జై చంద్రబాబు.. జోహర్ ఎన్టీఆర్.. అనే నినాదాలు వేదిక దద్దరిల్లేలా చేశాయి.

ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రతీ కార్యకర్త పాల్గొని 'కూడు గుడ్డ గూడు' అనే నినాదంతో అన్న ఎన్టీఆర్ ఆరోజు పార్టీ స్థాపించి, తెలుగోడి ఆత్మగౌరవం దేశం నలుమూలల వ్యాప్తి చేసిన విధానాన్ని కొనియాడారు. పేదోడి చేతికి అధికారం అనే ఆయుధాన్ని అందించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రుచి చూపించిన విధానంపై ప్రశంసలు కురిపించారు. తెలుగు జాతి అభ్యున్నతే అజెండాగా పెట్టుకుని తెలుగోడికి పార్టీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పండుగ పూట దేవుడన్నం తినే పేదోడి నోటికి ప్రతీ రోజు అన్నం తినే విధంగా చేసిన జెండాకి 40 వసంతాలని తెలిపారు. నాడు పండుగ పూట దేవుడి గుడి ముందు వేసే పందిరి ఇళ్ల కంటే దారుణమైన పూరిళ్లలో బ్రతుకుతున్న పేదోడికి రేకుల కప్పు ఇళ్లలో వుండేలా చేసిన జెండాకు 40 వసంతాలని అని ఈ వేడుకలలో భారీగా పాల్గొన్న అభిమానులు మాట్లాడారు.

40 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాలకు పార్టీ చేసిన సేవలను గుర్తు చేశారు. చదువుకు దూరం అయిన బడుగు బలహీన వర్గాలకు సాంఘిక గురుకుల పాఠశాల ప్రస్థానంతో పాటు పేదోడికి పార్టీ చేసిన సేవలను స్మరించుకున్నారు. రాబోవు రోజుల్లో పార్టీకి తమ సేవలను ఎలా ఉపయోగించాలి అని చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఒకరికి ఒకరు ఒక సమూహంగా చర్చించుకోవడం జరిగింది.

ఇవి కూడా చదవండి