
ఎవరు నువ్వు అంటే మద్రాసీ అని చెప్పుకునే స్థాయి నుండి ‘నేను తెలుగు వాడిని.. నాది తెలుగురాష్ట్రం.. నాది ఆంధ్రప్రదేశ్’ అని దేశం నలుమూలలా సగర్వంగా ప్రకటించుకునేలా తెలుగు వాడి ఆత్మగౌవాన్ని నిలబెట్టిన పార్టీ టీడీపీ. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా టీడీపీ ఆవిర్భావ వేడుకల్ని యూరప్‌లోని పోలాండ్‌లో ఎన్నారై టీడీపీ యూరోప్ టీమ్ ఘనంగా నిర్వహించింది. ‘ఇది రా నా తెలుగుదేశం సత్తా’ అని చెప్పుకునేలా, దేశం దాటి వచ్చినా పార్టీ మీద అభిమానం పోదని చాటి చెప్పింది. పోలాండ్ ఎన్నారై టీడీపీ సభ్యులు ప్రవీణ్, ఆజాద్, చైతన్య తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి పార్టీకి సంబంధించిన జెండాలు, బ్యానర్లతో పాటు ఇతర మెటీరియల్స్‌ను కార్యక్రమం జరిగిన చోటుకు చేర్చేందుకు సహాయం చేసి 40 వసంతాల వేడుకలు పోలాండ్‌లో ఘనంగా జరిగేలా చేసిన డా. కిషోర్ బాబు చలసానికి, అలాగే ఇండియా నుండి మెటీరియల్ పోలాండ్‌కు వచ్చేందుకు సహాయం చేసిన iTDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధనేకుల నాగ మల్లేశ్వర రావు(మల్లి)కు ఎన్నారై టీడీపీ యూరోప్ టీమ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

ఇవి కూడా చదవండి