
తెలుగుదేశం జీసీసీ ఆధ్వర్యములో గల్ఫ్ దేశాలైన కువైత్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయి, అబుధాబి, షార్జా, రాస్ అల్-ఖైమా, ఫుజైరాహ్ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించి అందుకు కావలసిన ఎర్పాట్లు చేస్తున్నారు. ఖతార్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరాం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాలన్ని ఇటీవలే ప్రకటించిన ఎన్నారై టీడీపీ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ సందర్భముగా తెలుగుదేశం కువైత్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలోని తెలుగు దేశం అభిమానులందరూ ఆయా దేశాలలో జరగనున్న వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






