AP News.. గుంటూరు: టీడీపీ కార్యకర్తను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు

ABN , First Publish Date - 2022-08-26T16:12:23+05:30 IST

టీడీపీ (TDP) కార్యకర్త వెంగళరావును సీఐడీ పోలీసులు (CID Police) అరెస్టు చేశారు.

AP News.. గుంటూరు: టీడీపీ కార్యకర్తను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు

గుంటూరు (Guntur): టీడీపీ (TDP) కార్యకర్త వెంగళరావును సీఐడీ పోలీసులు (CID Police) అరెస్టు చేశారు. ఘర్షణ మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్‌ (YouTube channel)ను నిర్వహిస్తున్న ఆయన తన ఛానల్‌లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అరెస్టు చేశారు. తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని వెంగళరావు ప్రకటించారు. అర్ధరాత్రి అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. ప్రభుత్వంలోని లోపాలు, ప్రజాప్రతినిధుల తప్పులను ఎత్తి చూపిస్తూ.. బలంగా తన వాయిస్ వినిపించడాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. దీంతో అతనిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్టు చేశారు. నిన్న కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకున్న నేపథ్యంలో డీజీపీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన కార్యక్రమంలో వెంగళరావు పాల్గొన్నారు. తిరిగి నెల్లూరు వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-08-26T16:12:23+05:30 IST