ధాన్యం సొమ్ములు చెల్లించకుంటే పోరాటమే

ABN , First Publish Date - 2022-06-28T05:27:45+05:30 IST

రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజ నేయులు డిమాండ్‌ చేశారు.

ధాన్యం సొమ్ములు చెల్లించకుంటే పోరాటమే
గుండుగొలను జంక్షన్‌లో రాస్తారోకో చేస్తున్న కౌలు రైతులు, టీడీపీ నాయకులు

ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు

భీమడోలు, జూన్‌ 27 : రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజ నేయులు డిమాండ్‌ చేశారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించనందుకు నిరసనగా గుండుగొలను గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు,కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్ని మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లోని 1,350 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బకాయిలు చెల్లించకపోతే రైతు పక్షాన అఖిల పక్షంతో పోరాటానికి సిద్ధమవుతామన్నారు. కౌలు రైతుసంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి  శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యం సొమ్ము చెల్లించకపోతే దశలవారీ నిరసనలు చేపడతా మన్నారు. చేతిలో చిల్లి గవ్వలేక అన్నదాతలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రైతు సంఘ నేతలు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రావు, టీడీపీ నేతలు శిరిబత్తిన కొండ బాబు, కర్ణం పెద్దిరాజు,  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:27:45+05:30 IST