మొబైల్‌ అన్న క్యాంటీన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-16T07:32:01+05:30 IST

ప్రకాశ్‌ నగర్‌ (రాజమహేంద్రవరం)ఆగస్టు 15 : శాసనమండలి మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజును పురస్కరించుకుని భవానీ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసు

మొబైల్‌ అన్న క్యాంటీన్‌ ప్రారంభం
క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో భోజనం వడ్డిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, గన్ని, యర్రా తదితరులు

జగన్‌ పాలనలో ప్రజలకు నిత్యం ఆకలి మంటలే 

అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో టీడీపీ నేతలు

ప్రకాశ్‌ నగర్‌ (రాజమహేంద్రవరం)ఆగస్టు 15 : శాసనమండలి మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజును పురస్కరించుకుని భవానీ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ముఖ్య అతిఽథిగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి అన్నక్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచనతో ఇప్పటికే క్వారీ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నక్యాంటీన్‌ నిర్వహించడం జరుగుతోంద న్నారు. అన్న క్యాంటీన్‌ ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదన్న ఆలోచనతో మొబైల్‌ క్యాంటీన్‌ ఏర్పా టు చేయడం జరిగిందని వివరించారు. ఈ మొబైల్‌ అన్న క్యాంటీన్‌ ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో  ఉంటుందని తెలిపారు. దీనిద్వారా రోజుకు 120 మందికి రూ.5కే నాణ్యమైన భోజనం పేదలకు పెట్టడం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలకు నిత్యం ఆకలి మంటలే మిగిలాయని మండిపడ్డారు. అన్నక్యాంటీన్ల ద్వారా వచ్చే ఎన్నికల వరకు  ప్రతిరోజు రూ.5లకే నాణ్యమైన భోజనం పేదలకు పెడతామన్నారు. .తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అన్న క్యాంటీన్లను తమ అధినాయకుడు చంద్రబాబు ప్రారంభిస్తారని స్పష్టంచేశారు. కాగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలు  ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన కోసం సర్వమత ప్రార్ధనలు చేశారు. 





Updated Date - 2022-08-16T07:32:01+05:30 IST