
ఢిల్లీ: మాజీమంత్రి నారాయణ అరెస్టులో నిబంధనలు పాటించలేదని టీడీపీ ఎంపీలు అన్నారు. స్థానిక పోలీసులకు, కుటుంబీకులకు అరెస్ట్ సమాచారం ఇవ్వలేదన్నారు. రాజ్యాంగ హక్కులను ఏపీ పోలీసులు ఉల్లంఘించారని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందన్నారు. నారాయణను కావాలని ఇరికించేలా రిషాంత్‌రెడ్డి పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషాంత్‌రెడ్డి సహా బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి