అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించే యోచనలో టీడీపీ

ABN , First Publish Date - 2022-03-03T22:27:22+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించే యోచనలో టీడీపీ పొలిట్‌బ్యూరో ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించే యోచనలో టీడీపీ

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించే యోచనలో టీడీపీ పొలిట్‌బ్యూరో ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా? అనే దానిపై టీడీపీ పొలిట్‌బ్యూరో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీఎల్పీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కౌరవసభను తలపించేలా ఏపీ అసెంబ్లీ సమావేశాలున్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఎద్దేవాచేశారు. ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నిర్వహణ.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. విజయవాడలో మహానాడును జరపాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. 


అలాగే అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పును టీడీపీ పొలిట్‌బ్యూరో స్వాగతించింది. జగన్ ఇప్పటికైనా 3 రాజధానులు అనే మోసాన్ని కట్టిపెట్టాలని సూచించింది. 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' ప్రకటన చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలని టీడీపీ పేర్కొంది. 3 రాజధానులంటూ ఇతర ప్రాంతాలను మోసగించారని, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.

Updated Date - 2022-03-03T22:27:22+05:30 IST