అధికారంలోకి వచ్చేది టీడీపీనే

Published: Sun, 27 Mar 2022 23:39:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అధికారంలోకి వచ్చేది టీడీపీనే మాట్లాడుతున్న గౌరు దంపతులు

  1. దుర్వేసి గౌరవ సభలో గౌరు దంపతులు


గడివేముల, మార్చి 27: అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వ మేనని మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దుర్వేసి గ్రామంలో  గౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టీడీపీ కార్యకర్తలు తిరుపాడు గ్రామం నుంచి దుర్వేసి గ్రామం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తూ గౌరు దంపతులకు ఘన స్వాగతం పలికారు. నిత్యావసర ధరలు పెరిగాయని, గ్యాస్‌, కరెంట్‌ బిల్లులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు గౌరు దంపతులతో వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజావేదికను కూల్చి రాష్ట్రంలో విధ్వంసక పాలనను తెరలేపారని అన్నారు. హత్యలు, కబ్జాలు పెరిగిపోయాయని అన్నారు. నిత్యావసర, ఎరువుల ధరలు ఆకాశన్నంటాయని, ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారని అన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5లక్షల కోట్లు అప్పు తెచ్చాడని అన్నారు. ఈ అప్పులపై కాగ్‌ ప్రశ్నిస్తే 48 వేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. పొదుపు మహిళలకు సున్నా వడ్డీ ఇవ్వడం లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. 


ప్రజామోదం లేకుండా జిల్లాల విభజనా?


ప్రజామోదం లేకుండా జిల్లాల విభజనను చేపట్టారని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల, పాణ్యం మండలాలను కర్నూలు జిల్లాలో కలపడంతో ఆయా మండలాల్లోని టీడీపీ నాయకులతో, జేఏసీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. పాణ్యం, గడివేముల మండలాలను కర్నూలు జిల్లాలో కలిపితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కలెక్టర్‌, సబ్‌కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. పాణ్యం, గడివేముల మండలాల సమస్యలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వారా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. దీంతో పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలని కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపించారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, కృష్ణయాదవ్‌, శ్రీనివాసయాదవ్‌, రామచంద్రారెడ్డి, రఫిక్‌, చిందుకూరు సర్పంచ్‌ అనసూయమ్మ, వడ్డు లక్ష్మీదేవి, సుభద్రమ్మ, ఆచారి, గిరిబాబు, దిలి్‌పకుమార్‌రెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, గని హర్షవర్దన్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.