బ్రేకింగ్ : YSRCP విశ్వప్రయత్నాలన్నీ ఫెయిల్.. చివరి నిమిషంలో TDP గెలుపు..

ABN , First Publish Date - 2021-11-17T19:16:11+05:30 IST

ఏపీలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి...

బ్రేకింగ్ : YSRCP విశ్వప్రయత్నాలన్నీ ఫెయిల్.. చివరి నిమిషంలో TDP గెలుపు..

కృష్ణా జిల్లా : ఏపీలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోలింగ్ వరకూ ఓ లెక్క అయితే.. కౌంటింగ్ రోజు సీన్ మొత్తం మారిపోయింది. వైసీపీ ఓడిన చోట రీ కౌంటింగ్‌ చేసి గెలవాలని విశ్వప్రయత్నాలూ చేస్తోంది. ఇప్పటి వరకూ ఇలా రీ కౌంటింగ్ చేసి ఒకట్రెండు చోట్ల గెలిచింది కూడా. మరికొన్ని చోట్ల పట్టుబట్టి మరీ రీ కౌంటింగ్ చేయించి వైసీపీ పరువు పోగొట్టుకుంది.


అటు కుప్పం.. ఇటు జగ్గయ్యపేట..!

ముఖ్యంగా.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటిని కైవసం చేసుకునేందుకు వైసీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో ఇన్ని చోట్ల ఎన్నికలు జరిగినా ఎక్కువగా కుప్పం, జగ్గయ్యపేట మున్సిపాలిటీల గురించే ఎక్కువ చర్చ జరిగింది. ఇప్పటి వరకూ జగ్గయ్యపేట టీడీపీకి కంచుకోటలాగా ఉంటూ వస్తోంది. అయితే ఆ కోటను బద్దలు కొట్టాలని ప్లాన్ చేసిన వైసీపీ ఇవాళ కౌంటింగ్ మొదలుపెట్టినప్పట్నుంచీ అంతా ‘తారుమారు’ రాజకీయాలు చేస్తోంది. ఇప్పటి వరకూ వెల్లడయిన ప్రతి వార్డు ఫలితంపైనా పెద్ద వివాదమే జరిగింది.


లాస్ట్ మినిట్‌లో సీన్ రివర్స్..!

తాజాగా.. 13వ వార్డుకు సంబంధింంచి రీ కౌంటింగ్ చేయాలని ఓడిన వైసీపీ అభ్యర్థి పట్టుబట్టారు. అయితే.. అధికారులు కూడా దీనిపై స్పందించి రీ కౌంటింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారులు, అధికార పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయేమో తెలియట్లేదు కానీ.. కౌంటింగ్ కేంద్రంలోని అధికారులు ఒక్కసారిగా ఓట్లు తారుమారు చేశారు. అయితే.. జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, సబ్ కలెక్టర్‌కు టీడీపీ అభ్యర్థి, నేతలు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ విషయంలో తెలుసుకున్న సబ్ కలెక్టర్ చివరి నిమిషంలో కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమే ఇక చేసేదేమీ లేక.. టీడీపీ అభ్యర్థే గెలిచినట్లు ప్రకటించేశారు.


వైసీపీ అభ్యర్థి ధర్నా..!

మరోవైపు.. నాలుగో వార్డులో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై.. టీడీపీ అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి 14 ఓట్లతో గెలిచినట్లు అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించేశారు. అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అయితే రెండు గంటల తర్వాత మళ్లీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి రీ కౌంటింగ్ చేయాలని వైసీపీ అభ్యర్థి పట్టుబట్టారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. డబుల్ డిజిట్ మెజారిటీ వస్తే కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో రీకౌంటింగ్ చేయాలని కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థితో పాటు మిగతా అభ్యర్థులు, స్థానిక నేతలు ధర్నాకు దిగారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం- 08, వైసీపీ- 08 స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తికాగా.. ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. ఈ రౌండ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మరి.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2021-11-17T19:16:11+05:30 IST