రైతు కోసం టీడీపీ గర్జన

ABN , First Publish Date - 2021-10-01T05:09:59+05:30 IST

రైతు కోసం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం గురువారం బాపట్ల పార్లమెంట్‌ స్థానం పరిధిలో నాలుగుచోట్ల భారీ ఎత్తున సాగింది. రైతులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అద్దంకి నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం పంగులూరు మండలం ముప్పవరం వద్ద జాతీయరహదారిపై నిర్వహించారు. జాగర్లమూడివారిపాలెంలోని గొట్టిపాటి కార్యాలయం నుంచి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ నేతృత్వంలో వందలాది మంది రైతులు, టీడీపీ కార్యకర్తలు ముప్పవరం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సమీపంలోని సుబాబుల్‌ తోటలను సందర్శించి రైతులతో మాట్లాడారు.

రైతు కోసం టీడీపీ గర్జన
ముప్పవరంలో రైతుకోసం టీడీపీ నిర్వహించిన భారీ ర్యాలీ

నాలుగు నియోజకవర్గాలలో నిరసనలు 

ముప్పవరంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొట్టిపాటి

రైతులు, కార్యకర్తలతో భారీ పాదయాత్ర

పర్చూరులో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీర్యాలీ

ఎస్‌ఎన్‌పాడు ర్యాలీలో నినదించిన శ్రేణులు

వైసీపీ రైతులను అన్యాయం చేస్తోందని నేతల ధ్వజం

ఒంగోలు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

రైతుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో టీడీపీ శ్రేణులు గర్జించాయి.  ట్రాక్టర్లు, బైకులు, ఎడ్లబండ్ల ర్యాలీలతోపాటు పాదయాత్రలతో తమ్ముళ్లు కదంతొక్కారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుకోసం తెలుగుదేశం పేరుతో దశల వారీగా టీడీపీ అందోళనలకు పిలుపునిచ్చింది. అందులోభాగంగా బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలో జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కోచోట కార్యక్రమం  ఏర్పాటుచేయగా ఆ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో కార్యక్రమం భారీగా జరిగింది. అలాగే సంతనూతలపాడు, వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి.

 రైతు కోసం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం గురువారం బాపట్ల పార్లమెంట్‌ స్థానం పరిధిలో నాలుగుచోట్ల భారీ ఎత్తున సాగింది. రైతులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అద్దంకి నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం పంగులూరు మండలం ముప్పవరం వద్ద జాతీయరహదారిపై నిర్వహించారు. జాగర్లమూడివారిపాలెంలోని గొట్టిపాటి కార్యాలయం నుంచి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ నేతృత్వంలో వందలాది మంది రైతులు, టీడీపీ కార్యకర్తలు ముప్పవరం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సమీపంలోని సుబాబుల్‌ తోటలను సందర్శించి రైతులతో మాట్లాడారు. 10 ఎకరాల రైతుకు తిండికి జరగని పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. సుబాబుల్‌ను కొనేవారు లేరని, కనీసం దుంపలు తీసే ఖర్చుకూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల మాజీ ఎంపీ శ్రీరాం మల్యాద్రి, టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పర్చూరు టీడీపీ శ్రేణులతో కిటకిటలాడిపోయింది. నియోజకవర్గంలోని ఆరు మండలాలు నుంచి వందలాదిమంది ఆ పార్టీ కార్యకర్తలు, రైతులు తరలి వచ్చి ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో పెద్దసంఖ్యలో ఆందోళనకారులు పాల్గొన్నారు. తెలుగు రైతు రాష్ట్ర నాయకుడు యార్లగడ్డ అక్కయ్యచౌదరితోపాటు ముఖ్యనేతలు నాయకత్వం వహించారు. పర్చూరులోని బొమ్మలసెంటర్‌లో టీడీపీశ్రేణులు బైఠాయించగా పోలీసులకు, నిరసనకారులకు పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది. అలాగే ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ శ్రేణులు తరలివచ్చి సంతనూతలపాడులో భారీ ర్యాలీ నిర్వహించాయి. బాపట్ల పార్లమెంట్‌ స్థానం తెలుగు రైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య, టీడీపీ మండల ముఖ్యనేతలు మద్దినేని హరిబాబు, తన్నీరు శ్రీనివాసరావులతోపాటు ఆయా మండలాల ముఖ్యనేతలు పాల్గొన్నారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సలగ రాజశేఖర్‌ నేతృత్వంలో చీరాల ప్రాంత టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వపరంగా ఏ ఒక్క సాయం రైతులకు అందడం లేదని, ఏ పంట పండించినా గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితులు ఏర్పడ్డాయని అందోళన వ్యక్తంచేశారు. 






Updated Date - 2021-10-01T05:09:59+05:30 IST