
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈనెల 29వ తేదీతో 40 వసంతాలుపూర్తి చేసుకుంటోంది. ఈమేరకు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ఆపార్టీ నాయకులు సన్నాహాలుచేస్తున్నారు.మంగళవారం సాయంత్రం 4గంటలకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రానున్నారు. 1982 మార్చి 29న ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వ్యవస్ధాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్ ప్రకటించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడు నివాళులర్పించనున్నారు. అలాగే సాయంత్రం 5గంటలకు ఎన్టీఆర్ భవన్లో పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి