మహనీయుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-05-29T05:51:45+05:30 IST

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ ఎన్టీ రామారావు ప్రజల మనస్సుల్లో సుస్తిర స్థానాన్ని సంపాధించుకున్న మహనీయుడని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు.

మహనీయుడు ఎన్టీఆర్‌
గణపవరంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణుల నివాళి

టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుక

పెదవేగి, మే 28: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ ఎన్టీ రామారావు ప్రజల మనస్సుల్లో సుస్తిర స్థానాన్ని సంపాధించుకున్న మహనీయుడని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని మండలంలోని అన్నిగ్రామాల్లోనూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం పండుగ వాతావరణంలో ఎన్టీఆర్‌ జయంతిని జరిపారు. చింతమనేని ప్రభాకర్‌ దుగ్గిరాల గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. విజయరాయి, ముండూరు, బాపిరాజుగూడెం, పెదవేగిలలో కూడా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు.

ఏలూరు టూటౌన్‌: బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య మంత్రి ఎన్‌టీఆర్‌ అని మాజీ డిప్యూటీ మేయర్‌ చోడే వెంకటరత్నం అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయం,  బడేటి క్యాంపు కార్యాలయంలో ఎన్‌టీఆర్‌ శత జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫైర్‌స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్ళి ఎన్‌టీఆర్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఏలూరు పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి సూర్యచంద్రరావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

చింతలపూడి: ప్రగడవరంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాలభిషేకం జరిపారు. మండలంలో ఉన్న 19 పంచాయతీల్లోని పార్టీ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. నాగేశ్వరమ్మ, మెట్టపల్లి నాగమణి అనే ఇరువురు మహిళలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. రెండు వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. గ్రామ టీడీపీ నాయకులు జె.ముత్తారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు ఎం.వెంకట్రామయ్య, మండల కార్యదర్శి కోండ్రు దేవ, మాజీ జడ్పీటీసీ రాధారాణి, టి.చంద్రశేఖరరెడ్డి, చిలుకూరి శ్రీధర్‌రెడ్డి, బుద్దాల నాగవర్ధనరావు, నలగోపు కృష్ణమూర్తి, కొప్పెర్ల నాగరాజు, పలువురు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని పంచాయతీలలో ఎన్టీఆర్‌ విగ్రహాలు పెట్టాలని తీర్మానించారు. చింతలపూడిలో పట్టణశాఖ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. 

దెందులూరు: దెందులూరు, రామవరం, గోపన్నపాలెం, కొవ్వలి, సానిగూడెం, అలుగులగూడెం తదితర గ్రామాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు మాగంటి నారాయణ ప్రసాద్‌, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు మోతుకూరి నాని  తదితరులు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: కొమ్ముగూడెం సెంటరు, రెడ్డిగణపవరంలోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు టీడీపీ నాయకులు యంట్రప్రగడ శ్రీనివాసరావు, గద్దె అబ్బులు, పుసులూరి అచ్యుతరావు తదితరులు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణి చేశారు. రెడ్డిగణపవరంలో వ్యవసాయ కూలీలకు పులిహోరను పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌ జన్మదిన కేక్‌లను కట్‌చేసి అందరికి పంచారు. నల్లూరి కృష్ణమోహన్‌ ఎన్టీఆర్‌ జయంతిని పురష్కరించుకుని పారిశుద్ద్య కార్మికులకు ఎన్టీఆర్‌, చంద్రబాబు బొమ్మలతో ఉన్న టి.షర్టులను పంపిణీ చేశారు. 

పోలవరం: పంచాయతీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలో పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంచే దొరబాబు, నల్లా రాంబాబు, పాదం శ్రీను, జల్లేపల్లి వెంకటనరసింహారావ పాల్గొన్నారు.

గణపవరం:  మండలంలో ఏ.గోపవరం, మొయ్యేరు తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, నియోజకవర్గ టీడీపీ యువత అధ్యక్షుడు అద్దెపల్లి వాసురాజు, జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యాళ్ళసుబ్బారావు, మాజీ సర్పంచ్‌లు కొప్పిశెట్టి ఏసుబాబు, ఇంటూరి చంద్రమోహనరావు పాల్గొన్నారు. 

ద్వారకాతిరుమల: దొరసానిపాడులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. దివ్యాంగుడు లక్కాబత్తుల రమేష్‌తో కేక్‌ కట్‌ చేయించారు. ఉపాధి కూలీలకు కూల్‌డ్రింక్స్‌, బిస్కెట్లను అందించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రత్నాజీ చౌదరి, రాయపాటి గాంధీ, కారుమంచి మురళి, పసుమర్తి సోమశేఖర్‌, మిడతా రామకృష్ణ పాల్గొన్నారు.

ఉంగుటూరు: ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, కైకరం అక్కుపల్లిగోకవరం, ఎర్రమళ్ళ, గోపాలపురం, తిమ్మయ్యపాలెం తదితర గ్రామాలలో జయంతి వేడుకలను జరిపారు. ఆయా కార్యక్రమాలలో సర్పంచులు బండారు సింధు మధు, సలగాల గోపి, రాంధే లక్ష్మీ సునీత, బొమ్మిడి అప్పారావురాంధే రాజారావు, వడ్లమూడి మూర్తిరాజు, అల్లాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.




Updated Date - 2022-05-29T05:51:45+05:30 IST