నెదర్‌ల్యాండ్స్‌లో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-04-23T23:49:57+05:30 IST

నెదర్‌ల్యాండ్స్‌లో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు

నెదర్‌ల్యాండ్స్‌లో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు

NRI టీడీపీ యూరోప్ TEAM Dr.కిశోర్ బాబు,  నెదర్లాండ్స్ టీడీపీ అధ్యక్షుడు వివేక్ కరియావుల ఆధ్వర్యంలో శ్రీనివాస్ గోగినేని, నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్యామ్ సుందర్ రావు ఊట్ల, అమర్ రవి, వినోద్ బుడ్డి, శ్యామ్ పంపణ, తేజా గోళ్ల, ప్రసాద్ రామినేని, రామకృష్ణ ముప్పన, వెంకట్ కొక, సునీల్ వేములపల్లి, రవితేజ చెరుకూరి, బాల కళ్యాణ్ సమన్వయంతో నెదర్లాండ్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.  టీడీపీ నాయకుల సమక్షంలో కేట్ కట్ చేసి.. పరస్పరం శుభాభినందనలు తెలుపుకున్నారు. 


ఈ సందర్భంగా వచ్చిన అతిథులు,, చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమలాంటి ఎంతో మంది ఉన్నతి కోసం రాష్ట్రానికి IT పరిశ్రమలు తీసుకువచ్చిన  టీడీపీ అధినేత పుట్టినరోజు వేడుకలు చెయ్యటం తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. దేశాలు దాటినా తమ నాయకుడి మీద అభిమానం తగ్గదని, 2024 లో ఇదే అభిమానంతో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కలసి కట్టుగా పార్టీ కోసం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లాంటి నాయకులు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో ప్రతి వర్గం అభివృద్ధి చెందుతుందంటూ వారందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-04-23T23:49:57+05:30 IST