రౌడీలకు రౌడీని నేను.. పెద్దిరెడ్డిని హెచ్చరించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-07T20:25:55+05:30 IST

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రౌడీలకు రౌడీని నేను.. పెద్దిరెడ్డిని హెచ్చరించిన చంద్రబాబు

విజయవాడ: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనికిమాలిన మంత్రి అంటూ ఫైర్ అయ్యారు. విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం పాల్గొన్న ఆయన.. ‘‘రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. ఈ జిల్లాకు ఇన్‌చార్జ్ కూడా.. పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. రౌడీలకు రౌడీని నేను... నీ గుండెల్లో నిద్రపోతా... ప్రజలు తిరగబడితే... నీ రౌడీలు పారిపోవడం ఖాయం. బట్టలిప్పించడం ఖాయం...  జాగ్రత్త. సిగ్గు.. ఎగ్గు, మానం ఏమీ లేవు. అన్నిటినీ వదిలేశారు. దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు. అసలే ప్రతిపక్షం లేకపోతే... అడిగేవాడు లేకపోతే.. ఎలా? విజయసాయి రెడ్డి... విశాఖకు శనిలా పట్టాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-03-07T20:25:55+05:30 IST