Chandrababu comments: స్వాతంత్య్ర ఉద్యమంలో తెలుగువారిది కీలక పాత్ర

ABN , First Publish Date - 2022-08-13T18:37:42+05:30 IST

స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు వారు కీతక పాత్ర పోషించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu comments: స్వాతంత్య్ర ఉద్యమంలో తెలుగువారిది కీలక పాత్ర

హైదరాబాద్ : స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు వారు కీతక పాత్ర పోషించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని టీడీపీ అధినేత ఆవిష్కరించారు. దేశం నాకేమిచ్చింది అని కాదు.. దేశానికి నేనేమిచ్చాను.. అనే విధంగా ఆలోచన చేయాలని  పిలుపు నిచ్చారు. దేశంలో సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు (PV Narasimha rao) తెలుగు బిడ్డ కావటం గర్వకారణమని అన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య(Pingali venkaiah)ను యువత గుర్తు చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ (NTR) తీసుకొచ్చిన పాలసీలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు.


హైవేలు, ఐటీ, ఇరిగేషన్, తాగు‌నీరు సహా.. పెను విప్లవాలకు తెలుగుదేశం నాంది పలికిందన్నారు. నదులు అనుసంధానం జరిగితే దేశానికి నీటి ఎద్దడి ఉండదని తెలిపారు.నిరుద్యోగం, పేదరిక నిర్మాలన కోసం భారతదేశం సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. జాతి అభివృద్ధి కోసం నాటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సేవలు కీలకమన్నారు. నిజాయితీగా కష్టపడటం కూడా దేశభక్తే అని చెప్పుకొచ్చారు. ప్రపంచానికి తిండి పెట్టే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. భారతీయుడుగా గర్విస్తున్నానని... ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ప్రతీచోటా భారతీయులు.. తెలుగువారున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో బక్కిన (Bakkina), రావుల (Ravula), ఎంపీ కనకమేడల (Kanakamedala), అర్వింద్ కుమార్ గౌడ్ (Arvind kumar goud), కంభంపాటి (Kambampati) తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T18:37:42+05:30 IST