Chandrababu: తెలంగాణలో అడుగడుగునా చంద్రబాబుకు జననీరాజనం

ABN , First Publish Date - 2022-07-28T18:45:47+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో అడుగడుగున జననీరాజనం పడుతున్నారు.

Chandrababu: తెలంగాణలో అడుగడుగునా చంద్రబాబుకు జననీరాజనం

ఖమ్మం: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)కు తెలంగాణ (Telangana)లో అడుగడుగునా జననీరాజనం పడుతున్నారు. చంద్రబాబుకు గ్రామ గ్రామాన అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు. మోటార్ సైకిల్ ర్యాలీలు, కార్ల ర్యాలీలతో చంద్రబాబుకు యువకులు స్వాగతం పలికారు. జై చంద్రబాబు జైజై చంద్రబాబు నినాదాలతో  వీధులు మార్ర్మోగుతున్నాయి. ‘‘గోదావరి ముంపు ప్రాంతాలలో ప్రజలు సర్వంకోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచేందుకు వెళుతున్న.. మరోసారి మీ ప్రాంతానికి మీమీ గ్రామానికి వచ్చి తప్పని సరిగా మీ అందరినీ కలుస్తాను’’ అని చెబుతూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. 

Updated Date - 2022-07-28T18:45:47+05:30 IST