
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat)కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా బహుళార్థక సాధక ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై వివరించారు. ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి పోలవరం సత్వర పూర్తికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. పోలవరంపై కేంద్రం, పీపీఏ రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికలను ప్రభుత్వం ఎలా పెడచెవిన పెట్టి నష్టం చేసిందో అంశాల వారీగా వివరిస్తూ చంద్రబాబు లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి