జగన్ వైఖరితో ఏపీ ఆదాయానికి భారీ గండి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-23T01:01:31+05:30 IST

రాజధానిపై జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాజధానులపై ..

జగన్ వైఖరితో ఏపీ ఆదాయానికి భారీ గండి: చంద్రబాబు

అమరావతి: రాజధానిపై జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రాజధానుల బిల్లు రద్దుపై జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రెడ్డి తీరుతో ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు రాష్ట్ర ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతుందన్నారు. వివేకానందరెడ్డిని ఆయన అల్లుడే చంపించాడని కట్టుకథలు అల్లిస్తూ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 


‘ప్రజా సమస్యలు, అవినీతి, వివేకానందరెడ్డి హత్య నుంచి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించేందుకే ప్రతిపక్ష నేత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.  కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. శాంతిభద్రతలు క్షీణించాయి. ఇళ్ల స్థలాలు, వాటిల్లో నిర్మించిన ఇళ్లను రెగ్యులరైజ్ పేరుతో ఒక్కో పేద కుటుంబం నుంచి రూ.10 నుంచి రూ.20 వేల రూపాయలు వసూలు చేసి.. ఆదాయం పొందాలనుకోవడం దుర్మార్గమైన చర్య. పేద కుటుంబాలు ఎవరూ ఈ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెలరోజుల్లో ఉచితంగా పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.3,594 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించి దుర్వినియోగం చేసింది.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-23T01:01:31+05:30 IST