అసెంబ్లీ సెగ్మెంట్లకు టీడీపీ పర్యవేక్షకులు

ABN , First Publish Date - 2020-12-25T05:53:08+05:30 IST

సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా తెలుగుదేశంపార్టీ అధిష్టానం వ్యూహరచనచేస్తోంది.

అసెంబ్లీ సెగ్మెంట్లకు టీడీపీ పర్యవేక్షకులు

సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి

గుంటూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా తెలుగుదేశంపార్టీ అధిష్టానం వ్యూహరచనచేస్తోంది. రాష్ట్రంలోని 25పార్లమెంటరీ నియోజకవర్గాలకు  టీడీపీ, అనుబంధ విభాగాలకు కార్యవర్గాలను నియమించిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా 25లోక్‌సభాస్థానాలను ఐదు జోన్లుగా చేసుకుంది. ఒక్కో జోన్‌లోని ఐదు లోక్‌సభాస్థానాల్లో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలను ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగించినట్లు సమాచారం. జోన్‌-3లోకి కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభస్థానాలతోపాటు గుంటూరు, నరసరావుపేట, బాపట్లను తీసుకుని ఈ నియోజకవర్గాల బాధ్యతలను సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బి.చెంగల్రాయుడు (కడప)కు అప్పగించారు. ఈ మేరకు ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలకు పర్యవేక్షకులుగా ప్రకటించిన పేర్ల జాబితాను గురువారం మీడియాకు విడుదల చేశారు.

గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు పర్యవేక్షకులుగా నియమితులైన నేతల ప్రాంతాలు, వివరాలు... గుంటూరు (తూర్పు)- పొదిలి శ్రీనివాసరావు (ఒంగోలు), గుంటూరు (పశ్చిమ)- సింహాద్రి కనకాచారి (రాజమండ్రి సిటీ), ప్రత్తిపాడు- తూనుగుంట్ల సాయిబాబా (వేమూరు), తెనాలి- మొగిలి కల్లయ్య (కావలి), పొన్నూరు- సలగల రాజశేఖర్‌బాబు (బాపట్ల), మంగళగిరి- దొంతు చిన్నా (గన్నవరం), తాడికొండ- సాయన పుష్పవతి (గుడివాడ), పెదకూరపాడు-నవనీతం సాంబశివరావు (విజయవాడ సెంట్రల్‌), చిలకలూరిపేట- దాసరి ఉషారాణి (పర్చూరు), నరసరావుపేట-గొండుగుల గంగరాజు (చీరాల), సత్తెనపల్లి- జువ్వా రామకృష్ణ (మైలవరం), వినుకొండ- దూపాటి ఏసోబు (అద్దంకి), గురజాల- ఫజర్‌ రహిమాన్‌ (విజయవాడ ఈస్ట్‌), మాచర్ల- ఎస్కే కరిముల్లా (యర్రగుండపాలెం), వేమూరు- వి.రంగారావు (నెల్లూరు సిటీ), రేపల్లె- జె.రమణయ్య (నెల్లూరు రూరల్‌), బాపట్ల- దివి శివరాం (కందుకూరు)

జిల్లా నేతలకు కీలక బాధ్యతలు

జిల్లాకు చెందిన పలువురు నేతలకు అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా జోన్‌-4లోని ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యతను బీసీ నేత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు అప్పగించారు. పార్టీ నేతలు ఎండీ హిదాయత్‌కు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, చిట్టాబత్తిని చిట్టిబాబుకు కావలికి నియమించగా, రాయపాటి రంగారావుకు ప్రకాశం జిల్లా  కందుకూరు,   మానుకొండ శివప్రసాద్‌, గోనుగుంట్ల కోటేశ్వరరావు, వెన్నా సాంబశివారెడ్డిలకు ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పర్యవేక్షకులుగా నియమించినట్లు సమాచారం. కనపర్తి శ్రీనివాసరావును కృష్ణా జిల్లా గన్నవరం, వడ్రాణం హరిబాబును గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు పర్యవేక్షకులుగా నియమించారు.


Updated Date - 2020-12-25T05:53:08+05:30 IST