పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-26T06:11:29+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గిం చినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకుండా ప్రజల రక్తాన్ని పిండేస్తుందని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
ఏలూరులో పెట్రోలు బంకు వద్ద టీడీపీ నాయకుల నిరసన

ఏలూరు టూటౌన్‌, మే 25: పెట్రోలు, డీజిల్‌ ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గిం చినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకుండా ప్రజల రక్తాన్ని పిండేస్తుందని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించనందుకు నిరసనగా ఫైర్‌స్టేషన్‌ పెట్రోల్‌ బంకు వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.8 టాక్స్‌ను తగ్గిం చిందన్నారు. కేంద్ర తగ్గించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడంపై మండిపడ్డారు. ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. టీడీపీని గెలిపించి చంద్రబాబునాయుడిని ముఖ్య మంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ కార్యాలయ కార్యదర్శి ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, మాజీ కార్పొరేటర్లు హనుమంతరావు, కౌరోతు బాలాజీ, వెంకటరత్నం, జలా బాలాజీ, జంపా సూర్యనారాయణ పాల్గొన్నారు.

చింతలపూడి నియోజకవర్గంలో..

చింతలపూడి/జంగారెడ్డిగూడెం/కామవరపుకోట, 25 : స్థానిక పెట్రోలు బంకు వద్ద టీడీపీ నాయకులు కొక్కిరిగడ్డ జయరాజు, పట్టణ శాఖ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాయకులు నత్తా రవి, రమేష్‌, కొత్తపూడి శేషగిరి, ఎం.సత్తిబాబు, పల్లె శ్రీను పాల్గొన్నారు.  జంగారెడ్డిగూడెంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు వద్ద నిరసన తెలిపారు. నాయకులు పెనుమర్తి రామ్‌కుమార్‌, తూటికుంట రాము, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, పగడం సౌభాగ్యవతి, నంబూ రి రామచంద్రరాజు, పాతూరి అంబేడ్కర్‌, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నంగులూరు జగత్‌కుమార్‌, కంప రాజేంద్ర, కుక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కామవరపుకోట చౌతనా సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో పెంచిన ధరలను తగ్గించాలని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, బస్‌ చార్జీలు, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని బుధవారం డిమాండ్‌ చేశారు. సీపీఐ, అనుబంధ సంస్థల ప్రతినిధులు టి.వి.ఎస్‌.రాజు, బుచ్చిబాబు, జి.సత్యనారాయణ, మీనుగుల దుర్గారావు పాల్గొన్నారు.

పోలవరం నియోజకవర్గంలో..

బుట్టాయగూడెం/కొయ్యలగూడెం, మే 25:పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం జీసీసీ పెట్రోల్‌ బంక్‌ వద్ద, కొయ్యలగూడెం మండలం కన్నాపురం పెట్రోల్‌ బంకుల ఎదుట నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలి పారు. బుట్టాయగూడెలో నాయకులు మొగపర్తి సోంబాబు, వాడపల్లి నాగా ర్జున, షేక్‌ బాజీ, కాగితాల గణపతిరావు, మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, బొమ్మ రామగంటలయ్య పాల్గొన్నారు. కొయ్యలగూడెంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాగార్జున,  ఎంపీటీసీలు షేక్‌ బాజీ, గణపతి, పార్టీ గ్రామ అధ్యక్షుడు గంట్లయ్య, చాపల చినబాబు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T06:11:29+05:30 IST