ఏపీలో జెడ్పీ ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం?

ABN , First Publish Date - 2021-04-01T23:18:12+05:30 IST

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ

ఏపీలో జెడ్పీ ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం?

అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడే రెచ్చిపోయిన అధికార పార్టీ.. ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజారుస్తాయంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎస్‌ఈసీ నీలం సాహ్ని నేతృత్వంలో జరిగే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని టీడీపీ అంటోంది. నిష్పక్షపాతంగా జరగవన్న విషయాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. 


అయితే ఎస్‌ఈసీగా భాద్యతలు చేపట్టిన నీలం సాహ్ని స్పీడు పెంచారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్  హాజరైనారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని నీలం సాహ్ని ఆదేశించారు. జిల్లాల్లో కోవిడ్ పరిస్థితులపై వివరాలు అడిగి ఎస్ఈసీ తెలుసుకున్నారు. శుక్రవాంర రాజకీయ పార్టీలతో నీలం సాహ్ని సమావేశంకానున్నారు.

Updated Date - 2021-04-01T23:18:12+05:30 IST