టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2021-07-25T06:33:44+05:30 IST

టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం

టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం

జి.కొండూరు/ రెడ్డిగూడెం, జూలై 24: రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు జుజ్జూరు వెళ్లిన టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, శావల దేవదత్‌కు వైసీపీ అల్లరి మూకల నుంచి రక్షణ కల్పించాలని, పోలీసులు టీడీపీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పజ్జూరు రవికుమార్‌, లంక రామకృష్ణ, మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ కరీముల్లా రెడ్డిగూడెం మండల టీడీపీ అధక్షుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి వేరు వేరు ప్రకటనల్లో శనివారం తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికి పంద చర్యగా వారు అభివర్ణించారు. రాష్ట్రంలో 8 వేల కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతింటే కనీసం తట్ట మట్టి పోయలేని అసమర్థ ప్రభుత్వమిదన్నారు. చేతులకు పేడ, బురద పూసుకుని టీడీపీ నేతలపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-07-25T06:33:44+05:30 IST