బిల్లులు చెల్లించాలని టీడీపీ డిమాండ్‌

ABN , First Publish Date - 2021-08-03T04:55:57+05:30 IST

ఉపాధి హామీ పనుల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర సభ్యుడు గంధం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

బిల్లులు చెల్లించాలని టీడీపీ డిమాండ్‌
డోన్‌లో వినతి పత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

డోన్‌, ఆగస్టు 2: ఉపాధి హామీ పనుల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర సభ్యుడు గంధం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ విశ్వ మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉపాధి పనులకు బిల్లులు చెల్లించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆగస్టు 1వతేదీ లోపుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం భేఖాతరు చేసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ ప్యాపిలి మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, తాడూరు వెంకటరమణయ్య, గోసానిపల్లి మల్లయ్య, మాజీ సర్పంచ్‌లు ఆదినారాయణ, ఎద్దుపెంట ఈశ్వరయ్య, ఉంగరానిగుండ్ల రాముడు, సాగునీటి సంఘం మాజీ డైరెక్టర్‌ ఉడుములపాడు రామచంద్రుడు, ఎర్రిస్వామి గౌడు, నీలం ప్రభాకర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


పత్తికొండ: పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిని వెంకట్రాముడు డిమాండ్‌ చేశారు. సోమవారం పత్తికొండ ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈవోఆర్డీ శ్రీకాంత్‌శర్మకు వినతిపత్రం అందించారు. టీడీపీ మండల అఽఽధ్యక్షుడు లోక్‌నాథ్‌, నాయకులు మనోహర్‌చౌదరి, తిమ్మయ్యచౌదరి, తిరుపాల్‌, రామానాయుడు, బీటీ గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.


మద్దికెర: పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు వెంటనే ఇవ్వాలని కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరశేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ నాయకుడు శ్రీరాములు, టీడీపీ మండల నాయకుడు పెరవలి రంగస్వామి డిమాండ్‌ చేశారు. సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ కరోనా దృష్ట్యా కూలీలు వలసలు వెళ్లలేక ఉపాధి పనులకు వెళ్లారని, ఇంతవరకు కూలీలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు 8వారాలకు పైగా వేతనాలు రాకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందన్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనే పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చిన వెంటనే కూలీల ఖాతాల్లో పడుతాయని తెలిపారు. 




Updated Date - 2021-08-03T04:55:57+05:30 IST