అమరావతిని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2020-08-09T10:40:22+05:30 IST

రాజధానిగా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం అమరావతి అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష తెలిపారు.

అమరావతిని కాపాడుకుందాం

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష


గుజరాతీపేట: రాజధానిగా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం అమరావతి అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాల యంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతినే రాజధానిగా కొనసా గిస్తామని ము ఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలను నమ్మించి ఇప్పుడు మోసం చేశారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్టు. దీనికోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాల భూములిచ్చారు.


రాజధానిపై కేంద్రం వేసిన శివరామకృష్ణన్‌ కమిటీ కూడా యాభై శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు విజయవాడలోనే రాజధాని ఉండాలని అభిప్రా యపడినట్లు చెప్పింది. అన్నీ అనుకూలంగా ఉన్నాయనే అమరావతిని ఎంపిక చేశాం. ప్రపంచమంతా తిరిగి చంద్రబాబు రూ.16లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అమరావతికి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు వచ్చేలా  చర్యలు తీసుకున్నా రు. 160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు  ప్రకటించారు.  టీడీపీ హయాంలోనే భోగాపురంలో ఎయిర్‌ పోర్టుకు శ్రీకారం చుట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఏపీయే.  ఇప్పుడు అమరావతిని ధ్వంసం చేస్తే ఆదాయం ఎలా వస్తుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టులను జగన్‌రెడ్డి భ్రష్టు పట్టించారు. ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడింది తెలుగుదేశం పార్టీయే.’ అని శిరీష తెలిపారు.

Updated Date - 2020-08-09T10:40:22+05:30 IST