కళా వెంకటరావు అరెస్టు దుర్మార్గం

ABN , First Publish Date - 2021-01-22T05:46:00+05:30 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళా వెంకటరావును అరెస్టు చేయడం దుర్మార్గమని, తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.

కళా వెంకటరావు అరెస్టు దుర్మార్గం
అంబేడ్కర్‌ సెంటర్‌లో నిరసన తెలుపుతున్న గిడ్డి ఈశ్వరి, తదితరులు

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి 

అంబేడ్కర్‌ కూడలి వద్ద టీడీపీ శ్రేణుల నిరసన


పాడేరు, జనవరి 21: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళా వెంకటరావును అరెస్టు చేయడం దుర్మార్గమని, తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. కళా వెంకటరావు అరెస్టును నిరసిస్తూ గురువారం అంబేడ్కర్‌ కూడలి వద్ద గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతున్నదని, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చీకటి మధు, కేవీ సురేశ్‌కుమార్‌, జి.శివకుమార్‌, కొట్టగుళ్లి రమేశ్‌నాయుడు, నీలకంఠం, జ్యోతికిరణ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:46:00+05:30 IST