రైతు కోసం కదంతొక్కిన టీడీపీ

ABN , First Publish Date - 2021-09-17T05:36:12+05:30 IST

రైతుల పట్ల జగన్‌ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మర్రిపూడిలో జరిగిన ర్యాలీలో టీడీపీ శాసనసభాపక్ష విప్‌, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఆ పార్టీ నియోజకవర్గ నేత దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. పెద్దదోర్నాలలో జరిగిన నిరసనలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎరిక్షన్‌బాబు, జడ్పీమాజీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ మన్నే రవీంద్రలు పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నంలో జరిగిన ర్యాలీలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పాల్గొన్నారు. రైతులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మొగుళ్లూరు నుంచి

రైతు కోసం కదంతొక్కిన టీడీపీ
టీడీపీ ఇన్‌చార్జి ఉగ్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బైక్‌ ర్యాలీ

 ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో నిరసనలు

పలుచోట్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు

స్వచ్ఛందంగా కదిలి వచ్చిన రైతులు

జగన్‌ సర్కార్‌ విధానాలపై ధ్వజమెత్తిన నేతలు

రేపు మరో నాలుగు నియోజకవర్గాల్లో ఆందోళనలు

ఒంగోలు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) :

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ శ్రేణులు కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసగా టీడీపీ ఐదురోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది. రోజుకు ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానానికి ఒకచోట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులోభాగంగా గురువారం ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు కందుకూరులో ఆందోళనలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ఆందోళనలకు నాయకత్వం వహించారు. నియోజకవర్గం అంతటి నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీలు, సభలు నిర్వహించారు. రైతు సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. పలుచోట్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా కార్యకర్తలు పాల్గొన్నారు.

 రైతుల పట్ల జగన్‌ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మర్రిపూడిలో జరిగిన ర్యాలీలో టీడీపీ శాసనసభాపక్ష విప్‌, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఆ పార్టీ నియోజకవర్గ నేత దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. పెద్దదోర్నాలలో జరిగిన నిరసనలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎరిక్షన్‌బాబు, జడ్పీమాజీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ మన్నే రవీంద్రలు పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నంలో జరిగిన ర్యాలీలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పాల్గొన్నారు. రైతులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

మొగుళ్లూరు నుంచి భారీ ట్రాక్టర్‌ ర్యాలీ

కనిగిరి నియోజకవర్గ శ్రేణులు, రైతులు వెలిగండ్ల మండలం మొగళ్ళూరుకు తరలివచ్చి అక్కడి నుంచి వెలిగండ్ల వరకు ర్యాలీ నిర్వహించారు. బైకులతో పాటు రైతులు ట్రాక్టర్లతో పాల్గొన్నారు. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీ, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలుగు రైతు పార్లమెంట్‌ అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు తదితరులు ముందుండి ర్యాలీని నిర్వహించారు. గిద్దలూరు మండలం తాళ్ళపల్లిలో నియోజకవర్గ ఇన్‌చార్జీ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నేతృత్వంలో ర్యాలీ జరగ్గా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. దర్శి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ముండ్లమూరులో జరగ్గా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పమిడి రమేష్‌లు పాల్గొన్నారు. అలాగే కందుకూరులోనూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం భారీఎత్తున నిర్వహించారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో టీడీపీ నేతలు మాట్లాడుతూ లాభసాటి వ్యవసాయానికి గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను వైసీపీ  ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడమే కాక చివరకు కొనే దిక్కు కూడా లేకుండాపోయిందన్నారు. ప్రభుత్వం కొన్న పంట ఉత్పత్తులకు నగదు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందన్నారు. వెలిగొండపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇదిలా ఉండగా బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని నాలుగు సెగ్మెంట్లలో శనివారం నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.






Updated Date - 2021-09-17T05:36:12+05:30 IST