విద్యుత్‌ చార్జీల పెంపు అన్యాయం

ABN , First Publish Date - 2021-10-27T05:20:44+05:30 IST

ట్రూ అప్‌ పేరుతో విద్యుత్‌ చార్జీలు పెంపు అన్యాయమని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ చార్జీల పెంపు అన్యాయం
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి

కామవరపుకోట, అక్టోబరు 26: ట్రూ అప్‌ పేరుతో విద్యుత్‌ చార్జీలు పెంపు అన్యాయమని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. వీరిశెట్టిగూడెంలో మంగళవా రం రైతుల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవ సాయ మోటర్లకు మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఎన్నికల్లో జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్‌ చార్జీలు పెంచకూడదని, ఇప్పటివరకు వసూలు చేసిన అదనపు చార్జీలు వెనక్కి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్‌ సంస్థల సామర్ధ్యం మేరకు పూర్తిగా ఉత్పత్తి చేయాలని కోరారు. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేయ వద్దని సూచించారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, తూతా లక్ష్మణరావు, మేరుగు సుందరరావు, నెక్కలపూడి మల్లికార్జునరావు, బొప్పన వీరశేఖరరావు, బొప్పన అంజియ్య, కంఠమనేని అంజిమూర్తి, బేతిన వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:20:44+05:30 IST