రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2022-10-02T04:59:28+05:30 IST

రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

జగన హయాంలో ధరలమోత

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే

నార్శింపల్లిలో బాదుడే బాదుడు 

గోరంట్ల, అక్టోబరు 1: రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన మోహన రెడ్డి పాలన అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు. గోరంట్ల మండలం నార్శింపల్లిలో శనివారం టీడీపీ శ్రేణులు ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.  ముఖ్య అతిథిగా హాజరైన బీకే పార్థసారథి మాట్లాడుతూ... గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ధరలు అమాంతంగా పెరిగిపోయాయన్నారు. సామాజిక పింఛన్ల మొత్తాన్ని రూ.3వేలు ఇస్తానని చెప్పి మూడేళ్లు పైబడుతున్నా ఆ హామీని సీఎం జగన నెరవేర్చలేకపోతున్నాడన్నారు. మాట తప్పని మడమతిప్పని మహాఘనుడు జగన్మోహనరెడ్డి అని విమర్శించారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఎన్నికల ముందు రూ.53వేల కోట్ల నిధులు మంజూరు చేసినా వాటిని ఖర్చుపెట్టకుండా దుర్వినియోగం చేశాడన్నారు. రోడ్లు భవనాల మంత్రిగా ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేకపోవడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఎవరైనా ప్రభుత్వపాలనను విమర్శిస్తే వారిపై కేసులు పెట్టడం జగన రెడ్డి రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలన సువర్ణ అధ్యాయమని, అప్పుడు జరిగిన అభివృద్ధిని బీకే పార్థసారథి ప్రజలకు వివరించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి అండగా తాను ఉంటానని బీకే భరోసానిచ్చారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు.  ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సోమశేఖర్‌, టీడీపీ నాయకులు అశ్వత్థరెడ్డి, నీలకంఠరెడ్డి, రాజారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకటరెడ్డి, నరసింహమూర్తి, మనోహర్‌, హరి, ఫిరోజ్‌బాషా, తిరుపాల్‌, నాగభూషణ, ప్రభాకర్‌, కోగిర శ్రీనివాసులు, కన్నారెడ్డి, వెంకటేశ, ఆదినారాయణ, వెంకటరంగారెడ్డి, నరేంద్రరాయల్‌, బొబ్బిలి రామ్మోహన, భరత, విక్రం, రాఘవేంద్ర, కోళ్ల శీన, నాగరాజు, దేవరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-02T04:59:28+05:30 IST