బీ కేర్‌ఫుల్‌..!

ABN , First Publish Date - 2022-10-07T05:05:39+05:30 IST

చేతిలో ఓ స్మార్ట్‌ఫోన, ఫింగర్‌ప్రింట్‌ డివైజ్‌ ఉంటే చాలు ఆధార్‌ ఎనేబుల్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎ్‌స)ద్వారా నగదు బదిలీ, నగదు వితడ్రా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

బీ కేర్‌ఫుల్‌..!

వేలిముద్రతో ఇష్టానుసారంగా లావాదేవీలు

ఏమారితే ఖాతాలో సొమ్ము స్వాహా

ఏఈపీఎస్‌ వితడ్రా కేంద్రాలపై పర్యవేక్షణ కరువు 

సోమందేపల్లి 


చేతిలో ఓ స్మార్ట్‌ఫోన, ఫింగర్‌ప్రింట్‌ డివైజ్‌ ఉంటే చాలు ఆధార్‌ ఎనేబుల్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎ్‌స)ద్వారా నగదు బదిలీ, నగదు వితడ్రా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో ప్రైవేట్‌ సంస్థలు ఆనలైన ద్వారా ఏజెన్సీలను ఇస్తున్నాయి. వీటిపై ఎవరికీ నియంత్రణ లేకపోవడంతో ఏఈపీఎస్‌ మనీ ట్రాన్సఫర్ల ద్వారా ఎవరి ఖాతాలోని నగదును కొందరు మోసగాళ్లు కాజేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లి ఖాతాలు పరిశీలించిన తరువాత బాధితులు లబోదిబోమంటున్నారు. సాంకేతికపరిజ్ఞానం రోజురోజకు పెరుగుతుండటంతో ఆధార్‌ నంబరు ద్వారా లావాదేవీలు  చేసేలా ఏ సమయంలోనైనా నగదు బదిలీ, వితడ్రా చేసేందుకు బ్యాంక్‌ మిత్రలు, బ్యాంక్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సేవా కేంద్రాల్లో బ్యాంకు మిత్రలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే ఇండియన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాక వీరు నిర్వహించే లావాదేవీలతో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నియమ నిబంధనల మేరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదు. ఖాతాదారులు డిపాజిట్‌, వితడ్రాలు చేసిన వెంటనే వీరు రసీదు ఇచ్చి లావాదేవీలు చేస్తారు. అలాగే వారి వివరాలను నమోదు చేసుకుంటారు. కానీ అవేవి లేకుండా ఏఈపీఎస్‌ వితడ్రా కింద యథేచ్ఛగా బ్యాంకు లావాదేవీలు జరిగిపోతున్నాయి. వేలిముద్ర ద్వారా ఖాతాదారుడు అడిగిన సొమ్ముకన్నా ఎక్కువగానే కొంతమంది అక్రమార్కులు నగదును వితడ్రా చేస్తున్నారు. ఈ కేంద్రాలపై ఎవరికి ఎలాంటి అజమాయిషీ లేకపోవడంతో అడుగడుగునా ఏఈపీఎస్‌ వితడ్రా కేంద్రాలు వెలిశాయి. బ్యాంకుకు వెళ్లి నగదు వితడ్రాకానీ, డిపాజిట్‌గాని చేసేందుకు సమయం పడుతుందని చాలామంది ఈ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.  ఇదే కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. నిరక్ష్యరాస్యులు వచ్చినప్పుడు వారి ఖాతాలో వారు చెప్పినదానికన్నా ఎక్కువగా వితడ్రా జరుగుతోంది. అంతేకాక కొన్ని ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు ఖాతాదారుడికి తెలియకుండానే మొబైల్‌ నంబరు ఆధారంగానే ఖాతాలను తెరుస్తున్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి మంజూరైన సొమ్ము ఆధార్‌ లింక్‌ అయిన ఖాతాలోకే పడుతుండటంతో తిరిగి వితడ్రా చేసుకునేందుకు డీలర్లవద్దకువెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో సొమ్ము వితడ్రా అయినప్పుడల్లా అదనంగా నగదు అందజేయాల్సి వస్తోంది. ఖాతాదారుడి అనుమతి లేకుండానే టార్గెట్ల కోసం కేవలం వేలిముద్ర ద్వారా ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు ఖాతాదారులు కోరుతున్నారు. ఏఈపీఎస్‌ వితడ్రా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


రూ.9,500 నగదు పోగొట్టుకున్నా ..

వేలిముద్ర వేయడంవల్ల రూ.9500 నగదును నా ఖాతాలోంచి పోగొట్టుకున్నాను. ఇటీవల బ్యాంకుకు వెళ్లి నగదును ఖాతాద్వారా డ్రా చేయడానికి ప్రయత్నించాను. అయితే బ్యాంక్‌ అధికారులు ఖాతాలో సొమ్ములేదని ఎలా పోయిందని అధికారులను ప్రశ్నిస్తే నా ఖాతాను పరిశీలించి వేలిముద్ర ద్వారా సొమ్ము వితడ్రా అయినట్లు తెలిపారు. 

నాగమ్మ, సోమందేపల్లి 


వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం.. 

బ్యాంక్‌ వినియోగదారులకు పూర్తీస్థాయిలో మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఏ బ్యాంకు కూడా కస్టమర్లకు ఫోనచేసి ఓటీపీలుకానీ, ఏటీఎం నెంబర్లు తెలుపమని అడగదు. ఏఈపీఎస్‌ ద్వారా సొమ్ము బదిలీచేసినా, వితడ్రాచేసినా ఆధీకృత ఏజెంట్లవద్దే చేయండి. కస్టమర్లకు సేవ చేసేందుకు బ్యాంకులు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్‌ వ్యక్తులను నమ్మి మోసపోకండి. ఒక్కసారిగా ఖాతా నుంచి నగదు వితడ్రా అయితే తిరిగి తీసుకోవడం చాలా వరకు అసాధ్యం. ఎక్కడైనా లావాదేవీలు జరిగితే తప్పనిసరిగా రసీదు తీసుకోండి.

వెంకటేశ్వర్లు, సీనియర్‌ మేనేజర్‌ 

Updated Date - 2022-10-07T05:05:39+05:30 IST