
అమరావతి: రైతులను ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి దగా చేస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. రెండున్నారేళ్ల జగన్ పాలనలో ఏ ఒక్క రైతైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆనాడు వైఎస్ హయాంలో క్రాప్ హాలీడే పదం వినిపించిందని.. మళ్లీ ఇప్పుడు జగన్‌రెడ్డి పాలనలో క్రాప్ హాలీడే పదం వినిపిస్తోందన్నారు. రైతులకు టీడీపీ ఏం చేసింది.. వైసీపీ ఏం చేసిందనే దానిపై చర్చకు సిద్ధమని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.