అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్ట్‌లు: Achennaidu

ABN , First Publish Date - 2022-05-10T17:50:28+05:30 IST

మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్ట్‌లు: Achennaidu

అమరావతి: మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్‌లు అని వ్యాఖ్యానించారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్‌లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయన అన్నారు. ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని అన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌ల పట్ల భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

Read more