
అమరావతి: కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy).. 10వ తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేయటం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(Achennaidu) ప్రశ్నించారు. పరీక్ష ఫలితాలు చివరి నిమిషంలో ఎందుకు వాయిదా వేశారో సీఎం, మంత్రి విద్యార్దులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ చేతకాని పాలనతో విద్యార్దుల భవిష్యత్తో ఆటలాడుతారా? అని నిలదీశారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని... జగన్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని చేశారని ఆయన అన్నారు.
విజయనగరం జిల్లాలో ఉన్న తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా? అని అడిగారు. జగన్ రెడ్డి తన అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయాలతో విద్యార్దుల భవిష్యత్తో ఆటలాడుతున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారాయన్నారు. నాడు నేడు పేరుతో కమీషన్లు దండుకోవటం తప్ప విద్యాభివృద్దికి జగన్ రెడ్డి చేసిన కృషి శూన్యమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి