
అమరావతి: ఓటీఎస్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని టీడీపీ శ్రేణులు బ్రహ్మాండంగా పోరాడారన్నారు. ‘‘మీ పోరాటానికి నా అభినందనలు’’ అని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న తమ పార్టీ నేతలపై పోలీసులు పలుచోట్ల అన్యాయంగా విరుచకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పీల్చుకుతింటున్నారన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పేదల పక్షాన టీడీపీ పోరాడుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి