చంద్రబాబు పెద్దాయన కాదా..? ఆయన వయసెంత?: అచ్చెన్నాయుడు

Published: Mon, 07 Mar 2022 14:04:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చంద్రబాబు పెద్దాయన కాదా..? ఆయన వయసెంత?: అచ్చెన్నాయుడు

అమరావతి: వయసును కూడా గౌరవించకుండా రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను అవమానించారన్న సీఎం జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.  గవర్నర్ వయసుకైనా విలువ ఇవ్వొద్దా అని సీఎం అనడం సరికాదన్నారు. ‘‘మేం గవర్నర్‌ను కాదు.. ఆయన తప్పిదాలనే ఎండగట్టాం. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్దాయన కాదా..? ఆయన వయసెంత..? చంద్రబాబును వైసీపీ సభలో అవమానించ లేదా..?’’ అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 


సీఎం జగన్ ఏమన్నారంటే....

ఈ ఉదయం జరిగిన బీఏసీ భేటీలో అచ్చెన్నపై  సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సరికాదన్నారు. గవర్నర్ ఏ ఒక్క పార్టీకి చెందినవారు కాదని తెలిపారు. వయసును కూడా గౌరవించకుండా అవమానించారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని సీఎం జగన్ అన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.